Health Minister JP Nadda: ఆందోళన అవసరం లేదు: కేంద్ర ఆరోగ్యశాఖ..! 1 d ago
చైనా లో విస్తరించి అంతర్జాతీయంగా కలవరాన్ని రేపుతున్న 'హ్యూమన్ మెటాన్యుమో వైరస్' (HMPV) ప్రస్తుతం మన దేశంలోనూ విస్తరిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో తొలి కేసులు నమోదవ్వగా, తాజాగా మహారాష్ట్రలోని నాగ్పురలో ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ నిర్థారణ అయ్యింది. 7 ,14 సంవత్సరాల వయస్సు ఉన్న ఈ చిన్నారులు దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారని అధికారులు తెలిపారు. దీనితో కలిపి భారత్ లో 7 కేసులు హెచ్ఎంపీవీ కేసులు నమోదయ్యాయి.
సోమవారం కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా తొలి కేసులు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. హెచ్ఎంపీవీ కొత్త వైరస్ కాదని, దీనిని 2001లో ప్రథమంగా గుర్తించారు. ఈ వైరస్ గాలి మరియు శ్వాస ప్రక్రియ ద్వారా వ్యాపిస్తుంది. అన్ని వయస్సుల వారిపై ప్రభావం చూపించగలదు. కేంద్ర ఆరోగ్యశాఖ, ఐసిఎంఆర్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ చైనా, పొరుగు దేశాలలో పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాయని నడ్డా తెలిపారు. దేశంలోని ఆరోగ్య వ్యవస్థలు, నిఘా నెట్‌వర్క్‌లు అప్రమత్తంగా ఉన్నాయని, ఆరోగ్య సంబంధిత సవాళ్లు వచ్చినప్పుడు తక్షణంగా స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని దీనివల్ల ఎవరు భయపడాల్సిన పనిలేదని చెప్పారు.
చైనాలో హెచ్ఎంపీవీ, ఇన్ఫ్లూయెంజా, ఆర్ఎస్పీఎ, వంటి శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తున్నాయన్న వార్తలతో భారత్ ఇప్పటికే అప్రమత్తమైంది. తాజాగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధ్యక్షతన జాయింట్ గ్రూప్ సమావేశం జరిగింది. శీతాకాలంలో సంభవించిన మార్పుల కారణంగా చైనాలో ఇన్ఫ్లూయెంజా, ఆర్ఎస్పీ, హెచ్ఎంపీవీ తరహా వైరస్‌లు వ్యాప్తి చెందుతున్నాయని జేఎంజీ తేల్చింది. భారతదేశంలో ఆందోళన అవసరం లేదని తెలిపారు. ముందస్తు చర్యల కింద, ఆరోగ్య శాఖ పలుచోట్ల ఈ వైరస్ సంబంధిత వ్యాధులకు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తున్నది.